DBN TELUGU:- కొమురం భీం
జిల్లాలోని చింతలమనేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో సోమవారం ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి రామకృష్ణ ఇందులో భాగంగా రైతులకి కావలసిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని డీలర్లకి ఆదేశించారు. ఎవరైనా నాసిరకం ఎరువులను ఉత్పత్తి చేసిన మరియు మహారాష్ట్ర కి తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్న వ్యవసాయ అధికారి ని సంప్రదించాలని, ఇక నుంచి ఎరువులు మహారాష్ట్ర కి వెళ్లకుండా AEO నీ చెక్ పోస్ట్ దగ్గర ఉంచి ఎరువుల విషయంలో జాగ్రత్తగా ఉండేలా చూస్తామని AO తెలిపారు.