DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి లో జరిగిన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, టాలెంట్ డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎండి అయాన్ తాజ్ కు వెస్టెన్ కంపిటిషనల్ స్పెషల్ బెస్ట్ ప్రైస్ అనౌన్స్ చేసి ప్రముకులచే బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేతకని సేవ సంగం అధ్యక్షుడు దుర్గం నరేష్ పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జీవితంలో డ్యాన్స్ అనేది ఒక కళగా భావించాలని, మానసిక ఆరోగ్యం కోసం ఎంతో దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్యాన్స్ మాస్టర్ లు, ప్రముఖులు టాలెంట్ డ్యాన్స్ నిర్వాహకులు సునర్కరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.