DBN TELUGU:-
- ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం.
- పర్యవేక్షించిన నోడల్ ఆఫీసర్ సాదుల లింగయ్య.
- ప్రధాన అర్చకులు రాంపల్లి అశోక్ శర్మ గారిచే కార్యక్రమం.
బెల్లంపల్లి మండలంలోని ఆకేనపల్లి గ్రామం మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వేను ముగించుకుని నూతనంగా పాఠశాలలో ప్రవేశము పొందిన విద్యార్థులకు పలక బలపం పాఠశాల వారు అందజేసి విద్యార్థులకు ఈ రోజు అక్షరాభ్యాసం కార్యక్రమం చేయించడం జరిగినదని ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి జేరిపోతుల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ బాసర సరస్వతి అమ్మవారి ఫోటోకు పూలమాలలు ధరించి వేద పండితులు ప్రధాన అర్చకుడితో పూజ నిర్వహించి నూతన విద్యార్థులకు పలకల మీద పురోహితునితో మరియు బెల్లంపల్లి మండల నోడల్ ఆఫీసర్ సాదుల లింగయ్య చేత పిల్లలను ఓడిలో కూర్చోపేట్టుకొని ఓంకారం పెట్టించారు. అనంతరం మంచి మార్గంలో విద్యాబుద్ధులతో పిల్లల భవిష్యత్తు ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు సరస్వతి అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ప్రధాన అర్చకులు రాంపల్లి అశోక్ శర్మ పంతులు మరియు ఆకేనపల్లి క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి జేరిపోతుల, ఉపాధ్యాయురాలు కే జ్యోతి, అంగన్వాడి టీచర్స్ సత్యమ్మ, పద్మ, విద్యార్థులు పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు గ్రామ పుర ప్రముఖులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.