DBN TELUGU:-
- విద్యార్థులు మొదటి రోజే పాఠశాలకు హాజరు కావడం అభినందనీయం: ఎంఈఓ.
- బెల్లంపల్లి ఎం ఇ ఓ మహేశ్వర్ రెడ్డి.
- విద్యార్ధులకు పాఠ్యపుస్తకాల పంపిణి.
విద్యా సంవత్సరం ప్రారంభం రోజున గురుకులానికి రావడం అభినందనీయమని బెల్లంపల్లి ఎం ఇ ఓ మహేశ్వర్ రెడ్డి అనారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ఆధ్వర్యంలో విద్యార్ధులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠ్యపుస్తకాలలో సమాచారాన్ని ఎప్పటికీ ఎప్పుడు ఉపాధ్యాయుల సహకారంతో కొత్త విషయాలను సూక్ష్మ దృష్టితో చదవడం అలవాల్చుకోవాలన్నారు. విద్యార్థులు విజయవంతంగా గత తరగతులను పూర్తిచేసుకుని నూతన విద్యా సంవత్సరంలో పై తరగతులకు రావడం అభినందనీయమన్నారు. ఉత్తమ జ్ఞానంతో అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల ఉత్త ఉత్తమ విద్యార్థిగా తయారు కావచ్చును అన్నారు. సమాజాన్ని అర్థం చేసుకుంటూ పాఠ్యపుస్తకాలలోని అంశాలను అనుసంధానం చేసుకోవడం విద్యార్థులకు నేర్పాలని ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రంగుల బొమ్మలతో అలంకరించిన 5వ తరగతి గదులను విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు చూపించి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐనాల సైదులు వైస్ ప్రిన్సిపల్ కోట రాజ్ కుమార్ జి వి పి శ్యాంసుందర్ రాజు, పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పూదరి నగేష్ గౌడ్, దాగం మహేష్, సీనియర్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, షిండే దత్త ప్రసాద్, దాసం అజిత, దుర్గం రమాదేవి,యండి కౌసర్, కోట్రంగి గణపతి, సజ్జనపు విజయ్,విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డూరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.