DBN TELUGU:- బెల్లంపల్లి మండలంలోని ఆకేనపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులను ముగించుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు పాఠశాలను ప్రారంభించారు.
పాఠశాల ఆవరణంలో రంగురంగుల ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట బొట్టు పెట్టి అక్షంతలు జల్లి పువ్వుల గుత్తులు చేతికి అందజేసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఆహ్వానించారు. మరియు ప్రభుత్వ బడిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, మరియు స్కూల్ యూనిఫార్మ్స్ పిల్లలకు అందజేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో, నైతిక విలువలను విద్యార్థులకు తెలియజేసేలా ప్రభుత్వ బడిలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తారు అని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు పిల్లల యొక్క నడవడికలను తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి,మరియు ఉపాధ్యాయులు కే జ్యోతి, ఎల్ సుధారాణి, అంగన్ వాడి టీచర్స్, సత్యమ్మ, వరలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల వివో తోకల వనిత, పిల్లల తల్లిదండ్రులు కే అనుష, వై సుజాత, కె సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.