DBN TELUGU:-
- డాక్టర్ కాంపల్లి శంకర్ కు జ్యోతిర్ వాస్తు సర్టిఫికెట్ ప్రదానం.
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందజేత.
- రిజిస్ట్రార్ భట్టు రమేష్ చేతుల మీదుగా అందుకున్నట్లు వెల్లడి.
-- బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ జ్యోతిర్వాస్తు పీజీ డిప్లమా ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం (సర్టిఫికెట్)ను అందుకున్నారు. హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆయనకు ఈ ధ్రువీకరణ పత్రాన్ని ప్రధానం చేశారు.
✓ వాస్తు జ్యోతిష్యం పై ఆసక్తితో.... బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రముఖ విద్యావేత్త కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న శంకర్ జ్యోతిష్యం మరియు వాస్తు పైన గల ఆసక్తితో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరంలో జ్యోతిర్వాస్తు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమాలో చేరారు. "ఆధునిక నిర్మాణ శిల్పం ఆర్కి స్ట్రక్చర్, వాస్తు బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్, జ్యోతిష శాస్త్ర ప్రాథమిక అంశాలు, దేవాలయాల వాస్తు శిల్పరీతులు, భూమి కొలతలు, గృహ నిర్మాణ వాస్తు, స్థల వాస్తు, బోరు బావుల వాస్తు" తదితర అంశాలపై అధ్యయనం పూర్తి చేశారు. 2023 డిసెంబర్లో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. 2024 ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేసిన ఫలితాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తీర్ణులకు సంబంధిత జ్యోతిర్వాస్తు పిజి డిప్లమా ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. బెల్లంపల్లి నుంచి తరలి వెళ్ళిన డాక్టర్ కాంపల్లి శంకర్ అక్కడి రిజిస్ట్రార్ భట్టు రమేష్ చేతుల మీదుగా అందుకున్నారు.
✓ అభినందనల వెల్లువ.
ఈ సందర్భంగా శంకర్ ని రిజిస్ట్రార్ మరియు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, కుటుంబ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు అభినందించారు. బెల్లంపల్లి పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదానంతో పాటు ప్రత్యేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, సేవకులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రంలో ఆయన మరెన్నో మెట్లు ఎక్కి అద్భుతాలు సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
✓ సరైన వాస్తు జ్యోతిష్యం చూసుకోండి.
బెల్లంపల్లి ప్రాంత ప్రజలు సరైన వాస్తు జ్యోతిష్య విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని పట్టణానికి చెందిన జ్యోతిర్ వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి శంకర్ ఆకాంక్షించారు. సంబంధిత సబ్జెక్టులో అవగాహన లేని వారు కూడా జ్యోతిష్యం వాస్తు చూస్తామని చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాయిజమ్మ సేవలు, షిర్డీ సాయి బాబా బోధనల స్ఫూర్తితో వాస్తు, జ్యోతిష్యం సేవలు చేయడానికి తాను విరామ సమయాలలో అందరికీ అందుబాటులో ఉంటానని జ్యోతిర్ వాస్తు సేవల సలహాలు సూచనలకు ఈ నెంబర్లో 9440937675 సంప్రదించగలరని జ్యోతిర్వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.