DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిజెపి కాసిపెట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు దొడ్డు వడ్లకు 500 రూపాయలు బోనస్ కేటాయించాలని, రైతు భరోసా కింద 15 వేల రూపాయలు రైతులకు చెల్లించాలని కాసిపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేసి, తహశీల్దార్ లేని పక్షాన ఆర్ఐ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు వడ్లకి రైతులకు ఇస్తానన్న బోనస్ ఇవ్వకపోవడం, మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం రైతులను మోసగించడమేనని అన్నారు. రైతు భరోసా కింద రైతులకు 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి గత ప్రభుత్వ మాదిరిగానే పదివేల రూపాయలు ఇచ్చిందని వర్షాకాల ప్రారంభ దృష్ట్యా రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 వేల రూపాయలు కౌలు రైతులతో సహ చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్న ఎన్నో రోజులు గడుస్తున్న ఇంకా చేయడం లేదు రుణమాఫీ వెంటనే చేయాలి డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శిలు నగరారపు ప్రసన్న, రెడ్డి బాలరాజ్, ఉపాధ్యక్షులు బాకీ కిరణ్, పెద్దపల్లి శంకర్, బిజెపి నాయకులు ఉడుతల శ్రీనివాస్ , బాలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.