DBN TELUGU:- భోజ్‌పురి నటి అమృత పాండే, ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. బీహార్‌లోని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆపార్ట్ మెంట్‌లో అమృత పాండే ఉరేసుకుంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహా న్ని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె రాసిన వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భోజ్‌పురి సినిమాలు, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్, టివి షోలలో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నిర్మాత- దర్శకుడు చింతామనితో విడాకులు తీసుకున్న తరువాత మానసికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమృత ఆత్మహత్య కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని పోలీస్ ఉన్నతాధికారులు ఆనంద్ కుమార్, శ్రీరాజ్ తెలిపారు.