Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఎంపి బరిలో యువనాయకుడు శ్రీనివాస్ రాంటెంకి.

DBN TELUGU:- రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ గా పోటీ చేయనున్నట్లు యువ నాయకుడు శ్రీనివాస్ రాంటెంకి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచినా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లాగే నియంతలా వ్యవహరిస్తుందని, పదవులు అన్ని రెడ్లకే కేటాయిస్తుందని పార్టీలకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్న యువ నాయకులను గెలిపించాలని కోరారు.





ఉచిత బస్సు అని చెప్పి మహిళల్లో మహిళలే జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేశారు, మరో వైపు బస్ స్టాప్ లల్లో బస్ లు నిలుప కుండా వెళ్లిపోతున్నాయి, పరిమితికి మించి ప్రయాణికులు నిండుగా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు, 500లకే గ్యాస్ అని చెప్పి ఇంకా అమలు చేయలేదు, డిసెంబర్ 9వ తేదీన ఒకేసారి లక్ష నుండి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు, జీరో కరెంట్ బిల్లు అని చెప్పి ఆగం ఆగం ఆఫీస్ ల చుట్టు తిప్పుకుంతున్నారు, 24గంటల ఉచిత కరెంట్ అని చెప్పి రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయి , గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని నోటిికేషన్లు ఇచ్చి 36000 పోస్ట్లు ఇచ్చాం అనడానికి సిగ్గు ఉండాలి, ఇస్తా అన్న గ్రూప్స్ పోస్టులు పెంచ కుండా డైరెక్ట్ పరీక్ష తేదీలు ఇవ్వడం సమంజసం కాదు, గెలవడం కోసం నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు, రావు రాజ్యం పోయి రెడీ రాజ్యం వచ్చిందే తప్ప మారిందెం లేదని మండి పడ్డారు, ఇవన్నీ మారాలి అంటే ప్రజాస్వామ్యం లో ప్రజల కోసం పోరాడే వ్యక్తులకు,యువకులకు పట్టం కట్టాలని , పార్టీలు అనేవి శాశ్వతం కాదు, ఎవరు గెలిచినా మనకు రావాల్సిన నిధులు వస్తాయి మన పార్లమెంట్ ని అభివృద్ది చేసుకోవచ్చు ఇప్పటి వరకు పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోయింది చాలు ఇకనైనా జాగృతం అవ్వండి ఓటే మన ఆయుధం విలువైన ఓటు ను సరిగ్గా వినియోగించి దొంగల భరతం పట్టాలి అని పిలుపు నిచ్చారు, స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్న తనను గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తే పేద ప్రజల గొంతునై వినిపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపెల్లి పార్లమెంట్ కి డబ్బు సంచులతో తాత, అయ్య పేరు చెప్పుకుని డబ్బు సంచులతో వారసులు వస్తున్నారు కుటుంబ పాలనను తిప్పి కొట్టాలని ప్రజలను వేడుకున్నారు. కాగా శ్రీనివాస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి 1286 సాధారణ ఓట్లు,3 బ్యాలెట్ ఓట్లు మొత్తం 1289 ఓట్లు పొంది 5వ స్థానంలో నిలవడం గమనార్హం.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.