DBN TELUGU:- నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసు సిబ్బంది గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు మంగళవారం ఉదయం నగరంలోని ఆటోనగర్ లోని షకీలా భీ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 1.25 కేజీల గంజాయి లభించిందని నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దిలీప్ తెలిపారు.
ఈ గంజాయి ఎక్కడినుండి తీసుకువస్తున్నావని విచారించగా తాను తన కూతురు నాందేడ్ జిల్లాకి వెళ్లి గంజాయి కొనుక్కొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి తన అల్లుడు అయిన షైక్ వసీమ్ ద్వారా నిజామాబాద్ లోని యువతకి ఎక్కువ రేటుకి అమ్ముతామని తెలపడం జరిగింది. అనంతరం వీరు ముగ్గురైన ఎ1 షకీలా భీ భర్త కరీం, ఎ2 అస్మ భర్త ఉమర్, ఎ3 షేక్ వసీం తండ్రి షేక్ మహమూద్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, ఎన్.డి.పి.ఎస్ చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండటం, అమ్మడం నేరమని అన్నారు. వీరిపైన కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్.ఐ మల్లేష్, సిబ్బంది ప్రభాకర్, షబ్బీరుద్దీన్, సంగయ్య, దారి సింగ్ పాల్గొన్నారు.