Type Here to Get Search Results !

విజయాలకు కేరాఫ్ గా నిలుస్తున్న సిఒఈ బెల్లంపల్లి.

DBN TELUGU:- 


- విజయాలకు

కేరాఫ్ గా నిలుస్తున్న సిఒఈ బెల్లంపల్లి.


- జెఈఈ మెయిన్స్ లో సత్తాచాటిన 9 మంది విద్యార్ధులకు అడ్వాన్స్డ్ కు అర్హత.


- నిన్న ఇంటర్ ఫలితాలు, మొన్న అజిమ్ ప్రేమ్ జి ప్రవేశాలు , అటెనక ఫోరెన్సిక్ సైన్స్ లో అడ్మిషన్స్. 


- గతంలో 991 మార్కులతో ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.





నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ)గురువారం విడుదలచేసిన జేఈఈ మెయిన్స్ సెకెండ్ సెషన్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ), బెల్లంపల్లి విద్యార్ధులు సత్తా చాటారు. 9 మంది విద్యార్ధులు ఉత్తమ పర్సెంటెయిల్ పొంది అడ్వాన్స్డ్ కు అర్హత సాధించిననట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. వీరిలో దుర్గం చరణ్ తేజ్ 85.04 పర్సెంటైల్ తో జాతీయ స్థాయిలో 11733 క్యాటగిరీ ర్యాంకుసాధించి కళాశాల టాపర్ గా నిలువగా ఆడె నవనీట్ 16301 ర్యాంకు తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. తరువాతి స్థానాల్లో వరుసగా తీగల అశ్రిత్(83.64), దుర్గం అఖిరనందన్(75.50),రామటెంకి శివ(73.27), వెల్తూరి అఖిల్(72.87), బత్తుల మధు(69.76), ఎరిగిరాల సాయిచరణ్(65.62), లింగంపల్లి అంజి-(63.39), విద్యార్ధులు తరువాతి స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచడమే కాకుండ 9 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించడం అభినందనీయమని ఆదిలాబాద్ రీజియన్ ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు ఫోన్ ద్వారా విద్యార్ధులను, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులను అభినందించారు.    

   

జెఈఈ మెయిన్స్-2024 మొదటి సెషన్ జనవరి 27 నుండి 31 వరకు,2వ సెషన్ ఏప్రిల్ 4 నుండి 9వరకు జరిగింది.ఈ రెండింటిలో ఉత్తమ ఫలితాన్ని తీసుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కటాఫ్ పర్సెంటైల్ తో అడ్వాన్స్డ్ కు అర్హత ఇచ్చినట్లు తెలిపారు. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు.దీనిలో ప్రతిభ చూపిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి లలో అడ్మీషన్స్ ఇస్తారు. సి ఓ ఈ లో 37మంది ఎంపిసి వియిద్యార్థుల్లో 9మంది ఐఐటి అడ్వాన్స్డ్ కు ఎంపిక కాగా ఇప్పటికే 5 మంది అజిమ్ ప్రేమ్ జి బెంగుళూర్ లో అండర్ గ్రాడ్యుయేషన్, మరో ఫోరెన్సిక్ సైన్స్ లో అడ్మిషన్స్ సాధించడం విశేషం. మిగిలిన విద్యార్థులు ఎఫ్సెట్, సి యూ సెట్, ఐసర్, నైసర్, ఐయం యు వంటి జాతీయస్థాయి ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ కళాశాలలో తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 80 శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు పొందటంతో బెల్లంపల్లి సీఓ ఈ కి రాష్ట్రంలో మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఇక్కడ అడ్మిషన్ తమ పిల్లలకు వచ్చేలా ప్రత్యేక తర్ఫీదు ఇప్పించడం ఈ కళాశాల ప్రతిష్టను అంచనా వేయవచ్చు. ఫలితాలు వెల్లడించిన సందర్భంగా గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు,అధ్యాపకులతో కలిసి విద్యార్ధులకు పుష్పగుచ్చాలతో అభినందించారు.కార్యక్రమంలో సిఓఈ సూపరింటిండెంట్ అవదూత రాజశేఖర్ వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, అధ్యాపకులు నాగినేని శ్రీరామవర్మ, మిట్టా రమేష్, చందా లక్ష్మీనారాయణ, కట్ల రవీందర్, దుర్గం శ్రీనివాస్, ముద్దసాని శోభ సిబ్బంది సమేందర్, శివతేజశ్వి, ఇడుగురాల మల్లేష్ విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.