DBN TELUGU:- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామంలో పర్యటించారు.
ఆ గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్ లో మృతి చెందడం పట్ల ఆమె తన బాధను వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ లేకపోవడం ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ సంఘటన జరిగిందని కవిత ఆరోపించారు. మాజీ సీఎం కేసీఅర్ పై పడి ఎడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి లేక పోవడం మన దురదృష్టం అని కవిత మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.