DBN TELUGU:- రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ పరిధిలోని చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలోని ఒక ఇంట్లో అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం తో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ లచ్చన్న ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్ శ్రీధర్, శ్రీనివాస్, రాజు, తిరుపతి లు ఇంట్లో తనిఖీ నిర్వహించి 30 లీటర్ల గుడుంబా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం చెన్నూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
> పట్టుబడిన నిందితురాలి వివరాలు.
- దుర్గం లక్ష్మి W/0 లేట్ పెంటయ్య, 32yrs, SC నేతకాని, కిష్టంపేట, చెన్నూరు మండలం.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా గుడుంబా తయారు చేసినా, అమ్మినా, నాటు సారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లము, పట్టిక, రవాణా చేసిన నిలువ చేసిన అటువంటి వ్యక్తుల పై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.