DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలి. మరియు వసతులు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాధికారి యాదయ్య కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఓ. యు జేఏసీ నాయకులు దుర్గం మల్లేష్ మాట్లాడుతూ... జిల్లాలోని కే.జి.బి.వి పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధంగా సీనియర్ టీచర్స్ గ్రూపులుగా ఏర్పడి ఎస్.ఓ ల మాట వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సీనియర్ సి.ఆర్.టి టీచర్స్ ఓకే చోట 5 నుండి 6 సంవత్సరాలు బోధించడం ద్వారా సీనియర్స్ ఎస్.ఓ లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వీటి ద్వారా విద్యార్థుల ముందు టీచర్స్ మరియు వర్కర్స్ ఎస్.ఓ లు గొడవలు పడుతున్నారు. ఇవి విద్యార్థుల పై ప్రభావం చూపుతుంది. అందువలన ఎవరైతె ఒకే దగ్గర 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పని చేస్తున్న వారిని ట్రాన్స్ఫర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ మరియు హ్యుమన్ రైట్స్ సభ్యులు రాజ్ కుమార్, రిపబ్లికన్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

