DBN TELUGU:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి చెక్ పోస్ట్ వద్ద 2.25 లక్షలు పట్టుకున్న పోలీసులు. వివరాల్లోకి వెళితే... వాంకిడి మండలంలోని ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ వద్ద గురువారం వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.2.25 లక్షలు పట్టుకున్నట్లు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు.
మహారాష్ట్ర కు చెందిన శ్రీనివాస రావు వద్ద రూ. 1 లక్ష, బల్లార్ష కు చెందిన సంజీవ్ తన కారులో ఆసిఫాబాద్ కు వెళ్తుండగా రూ. 1 లక్ష 25 వేలు పట్టుకున్నట్లు వివరించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్సై సాగర్ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో కెరమెరి ఎంపీఓ అన్జద్ పాష, జూనియర్ అసిస్టెంట్ బాబు భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ శివాజి ఉన్నారు.