Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు.

DBN TELUGU:-


- మేడారం జాతరకు

హెలికాప్టర్ సేవలు.


- హన్మకొండ నుండి అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు.


- ఒక్కొక్కరికి 28.999 రూపాయలు టికెట్ ధర.



- సమ్మక్క సారక్క జాతర పరిసర ప్రాంతాలను మొత్తం హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం.


- 4300 టికెట్ ధరతో పరిసర ప్రాంతాలను ఏరియల్‌ వ్యూ వీక్షించే అవకాశం.





తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దేవతలను గద్దెల దగ్గరికి తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వనప్రవేశం చేయించడం వరకు… అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది. జాతర జరిగే సమయంలో ఇంతకుముందు లాగే ఇప్పుడు కూడా మేడారం భక్తులకు హెలి కాప్టర్ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. 


                       ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు హెలికాప్టర్ సేవలు దర్శనానికి వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటాయి. మేడారం జాతరకు వెళ్లాలని భక్తులకు హన్మకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు. హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా VIP దర్శనాన్ని పొందవచ్చు. అందుకుగాను  దీని ధర రూ. ఒక్కొక్కరికి 28.999 వేల చొప్పున చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రైడులో ఓకే ట్రిప్పులో ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే జాతరకు వచ్చిన భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను కూడా వినియోగించడానికి మరో రైడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాతర జరిగే ప్రాంతంఏరియల్‌ వ్యూ 6 నుంచి 7 నిమిషాలు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మవారి గద్దెల పక్కనుంచి మొదలయ్యే రైడ్‍ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసర ప్రాంతాలను చూపిస్తారు. దీనికోసం ఒక్కొక్కరి నుంచి రూ.4300 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 0400399999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.