DBN TELUGU:-
- గురుకులంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.
- అలరించిన బహుభాషా కవిసమ్మేళనం మరియు పద్యపఠనం.
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ) బెల్లంపల్లిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల లాంగ్వేజ్ క్లబ్ ఆద్వర్యంలో బుదవారం బహుభాషా కమిసమ్మేళనం మరియు పద్యపఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరికీ పుట్టుకతో తల్లి నుండి నేర్చుకునే భాష మాతృభాషగా ఉంటుందని దానిని ఎప్పటికీ మరువకూడదన్నారు. ప్రతి ఒక్కరూ సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దవారి నుండి వారసత్వంగా పొందాలని అందుకు వృద్దులను అడిగి తెలుసుకోవాలని విద్యార్ధులకు సూచించారు.
-- ఆకట్టుకున్న బహుభాషా కవిసమ్మేళనం --
గోండి, లంబాడి, ఉర్ధు, హింది, మరాఠి, తెలుగు భాషల్లో విద్యార్ధులు తాము వ్రాసిన కవితలను గానం చేసి ఆకట్టుకున్నారు. అదేవిధంగా తెలుగులో పలువురు విద్యార్ధులు పద్యపఠనంచేసి తెలుగు భాషపై తమ ప్రేమను చాటుకున్నారు. విద్యార్ధులు చురుకుగా పోటీపడి పద్యాలు, కవితలు చెప్పడం పట్ల ప్రిన్సిపాల్ ఆనందం వ్యక్తంచేసూ వారికి చిరుకానుకలు అందజేశారు. వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గోండి భాషలో పెండూరి ఉమేష్(8వ తరగతి), లంబాడీ భాషలో రాథోడ్ జగదీష్(6వ తరగతి), ఉర్ధు భాషలో, మహ్మద్ షహజాద్(6వతరగతి),హిందీ లో రాజులదేవి ఆదిత్య(7వతరగతి), మరాఠి భాషలో జి.అరవింద్ (6వ తరగతి) తెలుగు భాషలో చుంచు సంజయ్, ఐనాల భగవత్(7వ తరగతి), కొండపల్లి కార్తీక్, కుర్సింగ ఆంజనేయ ప్రసాద్,కర్రె సనత్ కుమార్( 6వ తరగతి), ఇస్లావత్ రిరుపతి(8వ తరగతి), రాంటెకి శివప్రసాద్, జాంబోజి యశ్వంత్(9వ తరగతి)తదితర విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లాంగ్వేజ్ క్లబ్ అద్యక్షులు సజ్జనపు విజయ్ కుమార్, జెవిపి పొన్నం శ్రీనివాస్, ప్రేమలత, హారిక, కాసర్ల రాజేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

