Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: సిఓఈ సెట్ కు సర్వం సిద్దం: ప్రిన్సిపాల్.

DBN TELUGU:- 

- సిఓఈ సెట్ కు సర్వం సిద్దం: ప్రిన్సిపాల్.


- బెల్లంపల్లి లో 3 పరీక్షా కేంద్రాలు. 


- హెల్ప్ డెస్క్ మరియు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏర్పాటు.


- పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.


- ఆదిలాబాద్ రీజియన్ లోని 14 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.  





 

తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల సిఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ) ప్రవేశ పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. బెల్లంపల్లి లో తాళ్ళ గురిజాల రోడ్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సిఓఈ, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ రోడ్ లో గల బాలికల గురుకులం మరియు అదే రోడ్ లో శివాలయ దగ్గర నున్న కాసిపేట బాలుర గురుకులం లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలను ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్ధులు సంబందిత పరిక్షా కేంద్రాలలకు సంబందించిన చీఫ్ సూపరింటిండేంట్ ఫోన్ నంబర్ హాల్ టికెట్ లో ఉంటుందని వివరాలకు సంప్రదించవచ్చునన్నారు. ఉదయం 10:00 గంటల నుండి 1:00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందు చేరుకోవాలని విద్యార్ధులకు ఆయన సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, ఎగ్జామ్ ప్యాడ్ తప్పకుండా తీసుకొని రావాలన్నారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏమైనా తప్పులు దొర్లిఉంటే దానికి సరైన ఆధారల జిరాక్స్ కాఫీలు తీసుకొస్తే సరిచేయనున్నట్లు తెలిపారు. దీనికోసం పరీక్షా కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసామన్నారు. అదే విధంగా పరీక్ష హాల్ లో ఇన్విజిలేటర్స్ సహాయంతో ఓయంఆర్ లో బబ్లింగ్ చేసే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.