Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో ఆర్టీసీ బస్సు.

DBN TELUGU:-


- ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో ఆర్టీసీ బస్సు.


- ప్రయాణికులకు స్వల్ప గాయాలు.


- తప్పిన పెనుప్రమాదం.



ఆసిఫాబాద్ జిల్లాలోనీ బురుగూడ గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదం లో 12 మంది ప్రయాణీకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావటంతో నే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ప్రయాణీకులు చెబుతున్నారు. బస్సు వేగంగా తక్కువగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.