DBN TELUGU:-
- కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ లోలో మంటలు.
- యాదాద్రిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.
సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బోగిల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలు నిలిపివేయగా ప్రయాణికులు కిందకు దిగిపోయారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఘోర ప్రమాదం తప్పడంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.