DBN TELUGU:- పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గాజులపల్లి గ్రామంలో శనివారం విషాద ఛాయలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే... మంథని మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రోడ్డు ఆదర్శ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతునట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి మంథని లోని ఫ్రెండ్ బర్త్ డే వేడుకలలో పాల్గొన్నట్లు తెలిసింది. శనివారం తెల్లవారు జామున ఆదర్శ్ శవమై కనిపించాడు. గాజుల పల్లె పాత రోడ్డు లో గల (పచ్చనిమట్ల) దగ్గర తన చొక్కాతో చెట్టు కు ఉరి వేసుకొని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం పొలాల వద్దకు వచ్చిన రైతులు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు తీస్తున్నారు.