DBN TELUGU:- తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సి ఓ ఈ ) బెల్లంపల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ( ఎస్ జి ఎఫ్) అండర్ 19 బాల్ బ్యాట్మెంటన్ సెలక్షన్స్ పోటీలు జరిగాయి.
ఈ పోటీలలో పాల్గొన్న ఆసిఫాబాద్, మంచిర్యాల,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన క్రీడాకారులను సి ఓ ఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, తాళ్ల గురజాల ఏ ఎస్సై రాజన్న , తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాసిపేట్ ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ , ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావులు పరిచయం చేసుకున్నారు.
అనంతరం ఉమ్మడి అదిలాబాద్ బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కె భాస్కర్ క్రీడాకారులకు పలు సూచనలు చేసి పోటీలను బెస్ట్ ఆఫ్ త్రీ పద్దతిలో నిర్వహించారు. ఈ పోటిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ కళాశాల నుంచి 45 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరిగా రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును సెక్రెటరీ బాబురావు ప్రకటించారు. వీరిని ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాళ్ల గురజాల ఎఎస్ఐ రాజన్న, ప్రిన్సిపల్స్ సైదులు, సంతోష్, భాస్కర్, బాబూరావు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... క్రీడలతో మంచి క్రమశిక్షణ అలబడుతుందన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, నడిగోటి రాకేష్, కుమ్మరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
-రాష్ట్ర స్థాయికి ఎంపికైన జట్టు-
- ఎం. వేణు,ఎ. వర్ధన్,ఎం చరణ్(సి ఓ ఈ బెల్లంపల్లి).
- ఎ.తరుణ్ (టీఎస్ మోడల్ స్కూల్, ఆసిఫాబాద్).
- జె. మల్లయ్య,ఎం. ప్రణీత్ (టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జైపూర్).
- ఎం వెంకటరాజు , వర్ధన్ (టి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ కాసిపేట)