DBN TELUGU:- పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మంథని మండలంలోని నెల్లిపల్లి గ్రామంలో దంపతులు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. మృతులను అశోక్, సంగీతగా పోలీసులు గుర్తించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, ఆర్థిక ఇబ్బందులే దంపతుల ఆత్మహత్యకు కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.