DBN TELUGU:- మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, OUJAC-TSJAC చైర్మన్, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి దుర్గం భాస్కర్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో తాను చేసిన శాంతియుత పోరాటలే ఈ దేశానికి ఆదర్శం అని కొనియాడారు. ఆ మహాత్ముని బాటలోనె నడుస్తున్న వాళ్లము గా ఆయన ఆలోచనలు ముందుకు తీసుకొని వెళ్తామని అన్నారు. గాంధీ కలకన్నట్లుగా గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. BRS పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ ప్రాంతంలోని గ్రామాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి అని అన్నారు. గారడీ మాటలు చెప్పే కెసిఆర్, కేటీఆర్, బాల్క సుమన్ మాటలు నమ్మకుండా రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భుషణ శర్మ, పాతర్ల నాగరాజు, చెన్నూరి రాజేష్, దుర్గం వెంకట స్వామి, ఆలూరి సంపత్, మంచినీళ్ళ రాజేష్, పడాల మహేష్, అనిల్, మంచిర్యాల జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్,తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అనపర్తి యువరాజ్, OUJAC నాయకులు, రామగిరి శేఖర్, దుర్గం మల్లేష్, తరుణ్, నరేష్, సురేందర్, దేవేందర్, కుమార్, లింగంపల్లి మహేష్, మహేష్, కమల్ సింగ్, సిరాజ్, సుల్తాన్, తగరం రాజు, కృష్ణ, కరీం తదితరులు పాల్గొన్నారు.