DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ కేటాయించడంతో ఇన్ని రోజులుగా ఇద్దరి మధ్య నడుస్తున్న కయానికి ఈరోజుతో పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ నేతలతో ప్రగతి భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.