DBN TELUGU:- ప్రకాశం జిల్లాలో బుధవారం ఉదయం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రైవేటు బస్సు లారీ ఢీ కొన్న సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇరవై మంది గాయపడిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, ఎమ్మిగనూరు కు చెందిన మెప్మా సిబ్బంది మహిళలు విజయవాడ లో ట్రైనింగ్ కు బయలుదేరారు. మార్గమధ్యలో వీరి బస్సు ముందు వెళ్తున్న మరో వాహనం ప్రమాదానికి గురి కాగా అందులో ప్రయాణిస్తున్న వారు కూడా ఈ బస్సు లో ఎక్కారు. మేడపి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న లారీ వీరి బస్సు ను ఢీ కోనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి గాయాలు కాగా, మరో మహిళ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.