Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన కేసీఆర్.

DBN TELUGU:- ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జివో జారీ చేశారు.



అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశిస్తూ జీవో జారీ. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.1,00,000/- , మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా. అంగన్వాడీలకు వర్క్ ప్రెజర్ తగ్గించే విధంగా యాప్ సింప్లిఫైడ్ చేస్తాం. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. అంగన్‌వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు సార్లు అంగన్‌వాడీల వేతనాల పెంపు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.1,00,000/- , మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చూసింది. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా కల్పించారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందిస్తూ ప్రభుత్వం జీవో లు జరిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.