Type Here to Get Search Results !

అసలు... ఎవరి RS ప్రవీణ్ కుమార్...?

DBN TELUGU:-

- అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు...? 

- ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటున్నారు...?

- సిర్పూర్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు...?

- సిర్పూర్ ప్రజలు ఎందుకు ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలి...?



ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో ప్రేమమ్మ, సవారన్న దంపతులకు మొదటి సంతానంగా 1967లో జన్మించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలకు గురైనా పట్టువదలకుండా చదివి భారతదేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సంపాదించి 1995లో ఐపిఎస్ అయ్యారు. శిక్షణ పూర్తయిన అనంతరం 1998లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అడిషనల్ ఎస్పిగా పని చేశారు. 2001లో కరీంనగర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. పేద వర్గాల నుండి ఎదిగిన వ్యక్తి గనుక, పేద వర్గాల ప్రజలు తప్పుదారి పట్టి, దండకారణ్యంలో చేరితే వేలాది మందిని కలిసి,వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా మార్పు తీసుకువచ్చారు. ఎంతో మందికి ఉన్నత జీవితాన్ని అందించారు. అడవిలో కలిసి విలువైన ప్రాణాలు కోల్పోయి, కుటుంబాలను అంధకారంలో నెట్టివేయొద్దని సూచించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 

2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చి వందల మంది విద్యార్థులు ప్రాణాలు బలితీసుకుంటుంటే, ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తూ, విద్యార్థులతో చర్చించి చాలామంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. ఆంధ్ర పాలకుల, అధికారుల ఆదేశాలను లెక్కచేయలేదు. ఇషాంత్ రెడ్డి, సిరిపురం యాదయ్య వంటి అమరులను తన చేతులతో మోసిన అసలైన ఉద్యమకారులు మన ప్రవీణ్ కుమార్. ఉద్యమకాలంలోనే మళ్లీ పుస్తకం పట్టి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది రెండేళ్లు చదివారు. 

తిరిగి ఇండియా వచ్చిన తర్వాత గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి, కేవలం విద్యతోనే పేదల బతుకులు మకరుతాయని నమ్మి, తొమ్మిదేళ్లు ఉన్నత ప్రశాణాలున్న విద్యను ఉచితంగా అందించి, ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎదుర్కొని పది లక్షల మందిని చదివించారు. ఈయన హయాంలోనే మన సిర్పూర్ నియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి. వేలాది మంది నిరుపేద బిడ్డలను డాక్టర్లు, ఇంజనీర్లు, పైలెట్లుగా తయారుచేశారు. తొమ్మిదేళ్లు గురుకులాల సెక్రటరీగా పనిచేసి 900 పాఠశాలలు, 52 డిగ్రీ కాలేజీలు,7 మహిళా పిజి కాలేజీలు, సైనిక పాఠశాలలు, లా కాలేజీలు ప్రారంభించారు. వేలాది మందిని విదేశీ యూనివర్సిటీలకు పంపించారు. కేవలం తొమ్మిదేళ్లలో ఒక ఉద్యోగిగా, వెయ్యి కోట్ల బడ్జెట్ తోనే విద్యార్థుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చినపుడు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మొత్తం మన చేతిలో ఉంటే, ఆ బడ్జెట్ లోని ప్రతి పైసా పేదలకోసం ఖర్చు చేస్తే తెలంగాణలో నిరుపేదలు లేకుండా చేయవచ్చునని గ్రహించి, ఫూలే అంబేడ్కర్ కాన్శీరాం గారు చూపిన మార్గంలో నడవడానికి సిద్దమైన ప్రవీణ్ కుమార్ 2021లో తన 26 ఏళ్ల ఉన్నత ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

- ఆర్ఎస్ ప్రవీణ్ రాజకీయ ప్రవేశం:- 

-- పేద వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన పార్టీ అని, పేద వర్గాలకు చెందిన వ్యక్తుల నాయకత్వంలో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీలో ఆగస్టు 8,2021లో రెండు లక్షల మంది సమక్షంలో చేరి, గత 280 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టి ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస, ప్రజలందరి మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.