ఈ ఎవరెవరిరని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో లోకేష్ పోరాటం చేయనున్నారు. అందులో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు జాతీయ స్థాయిలో వివరించనున్నారు. అలాగే పార్లమెంట్లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్షపూరిత రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం తయారుచేసింది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లెవనెత్తి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఎంపీలకు లోకేష్ సూచనలు చేయనున్నారు. ఇక చంద్రబాబుపై నమోదైన కేసులపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా చర్చించనున్నారు. ఒకవేళ ఏసీబీ కోర్టు, హైకోర్టులలో చంద్రబాబుకు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టులో టీడీపీ న్యాయ పోరాటం చేయనుంది.
బ్రేకింగ్ న్యూస్: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి నారా లోకేష్.
September 14, 2023
0
DBN TELUGU:- టిడిపి అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.
Tags