వర్షంతో 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ (DLS) ప్రకారం శ్రీలంక చివరి
బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. పాక్ జట్టులో రిజ్వాన్ (86), షఫిక్(52) అర్ధశతకాలు చేయగా, ఇప్తికర్ అహ్మద్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం నరాలు తెగే ఉత్కంఠ మధ్య బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 42 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి... కుశాల్ మెండిస్ (91) సమరవిక్రమ(48) అసలకం (49) చెలరేగి చివరి బంతికి రెండు పరుగులు తీసి లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది. అలాగే ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఇండియాతో శ్రీలంక పోటీ పడనున్నాయి.