సోమవారం సాయంత్రం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గంటన్నరకు పైగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మూడు దశాబ్దాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి హెచ్ దేవెగౌడ సారధ్యంలోని సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. ఆ తర్వాత వచ్చిన వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టినా ఆమోదముద్ర పడలేదు. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందినా.. 2014లో లోక్ సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. తాజాగా నరేంద్రమోడీ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలపడంతో దేశ వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
బ్రేకింగ్ న్యూస్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.
September 18, 2023
0
DBN TELUGU:- భారత దేశంలో దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా డిమాండ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు నరేంద్రమోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.