DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... బెల్లంపల్లి పట్టణానికి చెందిన షేక్ ముజ్జు, చిలుముల సాగర్ లను పట్టుకున్నట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ శంకరయ్య యాదవ్ తెలిపారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా వారి వద్ద 95 గ్రాముల గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. గంజాయికి మహారాష్ట్ర రాష్ట్రంలోని బల్లార్షా లో తక్కువ ధరకు కొనుగోలు చేసి బెల్లంపల్లిలో అమ్ముతున్నారని ఎస్ ఎచ్ ఓ పేర్కొన్నారు.