Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: వచ్చేనెల 13 నుండి సంక్షేమ గురుకులాల క్రీడా సంబురాలు.

DBN TELUGU:-

- వచ్చేనెల 13 నుండి సంక్షేమ గురుకులాల క్రీడా సంబురాలు.

- సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.






- అక్టోబర్ 13నుండి 16 వరకు బాల బాలికలకు వేర్వేరుగా జోనల్ గేంస్.

- బెల్లంపల్లి సిఓఈ బాలుర గురుకులంలో జోన్ 1 (కుమ్రభీం ఆసిఫాబాద్,మంచిర్యాల,పెద్దపల్లి,ములుగు జిల్లాల)బాలురకు.  




 

- హాజరు కానున్న 4 జిల్లాల్లోని 11 బాలుర గురుకులాలకు చెందిన 935 మంది విద్యార్ధులు.

- జోనల్ గేమ్స్ కు పూర్తిగా సహకరిస్తానన్న బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే.

- సిఓఈ క్రీడామైదానాన్ని పరిశీలించిన ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి, రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ సట్ల శంకర్.   





తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ గేమ్స్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకుందని అందులో భాగంగా జోన్ వన్ లోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించిన జోనల్ గేమ్స్ బెల్లంపల్లి సిఓఈ లో నిర్వహించడానికి సిద్ధం కావాలని సంక్షేమ గురుకులాల ఆర్సిఓ కొప్పుల స్వరూప రాణి పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సి ఓ ఈ) బెల్లంపల్లి లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఐనాల సైదులు కు పలు సూచనలు చేశారు. ముందుగా రీజినల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శంకర్ కాసిపేట ప్రిన్సిపల్ సంతోష్ లతో కలిసి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె జోనల్ క్రీడలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పెద్దపీఠ వేస్తుంది. అందులో భాగంగా ప్రై సంవత్సరం జోనల్ స్థాయి క్రీడాపోటీలను నిర్వహిచి అందులో గెలుపొందిన విద్యార్ధులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వేధికల ద్వారా క్రీడలను నిర్వహిస్తుంది. ఆ క్రమంలో ఈ విద్యా సంవత్సరానికి గాను జోనల్ స్థాయి క్రీడలకు సంబందించి పలు వివరాలను సంస్థ కార్యదర్శి డా.నవీన్ నికోలస్ సర్క్యులర్ జారీచేశారు. అక్టోబర్ 13 నుండి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 వేధికల్లో జోనల్ స్థాయి క్రీడాపోటీలు 11 అంశాల్లో 3విభాగాలు( అండర్ 14,16,19)గా జరుగుతాయి. అందులో భాగంగా మొదటి జోన్ లోని 4జిల్లాల బాలురకు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ బెల్లంపల్లి లో జరుగుతాయని సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు. అలాగే మాట్లాడుతూ...కబడ్డీ,ఫుట్ బాల్,హ్యాండ్ బాల్,వాలీబాల్,బాల్ బ్యాట్మింటన్,టెన్నీకాయిట్,ఖో-ఖో,చదరంగం,క్యారంస్, వంద మీటర్లు, 2వందల మీటర్లు, 4వండల మీటర్లు, 8వందల మీటర్లు, 15వందల మీటర్లు 5 కీలో మీటర్లు పరుగు పందం మరియు షాట్ పుట్, డిస్కస్ థ్రో, లాంగ్ జంప్, హై జంప్, రిలే. 11 రకాల క్రీడాంశాలు అండర్ 14 అండర్ 17 అండర్ 19 మూడు విభాగాల్లో నిర్వహించనున్నట్లు స్వరూప రాణి తెలిపారు. ఈ సందర్భంగా... సమావేశం అనంతరం ఆర్ సి ఓ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మర్యాదపూర్వకంగా కలిసి జోనల్ గేమ్స్ కు సహకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన పూర్తి సహకారం ఉంటుందని వారికి తెలిపినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్స్ సట్ల శంకర్, కాసిపేట సంక్షేమగురుకుల ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, నడిగొట్టి రాకేష్, సల్పాల సంతోష్, కుమ్మరి శ్రీకాంత్, జెవిపి కొక్కుల రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.  




 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.