Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- తిరుమలలో చిక్కిన మరో చిరుత..!

DBN TELUGU:- తిరుమలలోని నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. గతంలో బాలిక పై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కడం గమనార్హం.


చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనుమానాస్పద ప్రదేశాల్లో బోన్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చిరుతను బంధించేందుకు మూడు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్షీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులను ఏర్పాటు చేయడంతో బోనాల చిరుత చెక్కింది.  50 రోజుల వ్యవధిలో అధికారులు చాకచక్యగా వ్యవహరించి మూడు చిరుతలను బంధించడం గర్వనారం.

తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. 

తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత ఆడదిగా అటవీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఆ చిరుత చిక్కిన ప్రదేశానికి దగ్గరలోనే మరో చిరుత చిరుత కూడా బోనాల చిక్కింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.