DBN TELUGU:- డ్రంక్ డ్రైవ్ ప్రమాదకరమని పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కొంతమంది వాహన డ్రైవర్లు తాగేసి వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఈరోజు తెల్లవారుజామున ఓ లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి.. రాంగ్ వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురి ప్రాణాలను బలి తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరగడంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణాలు పరిశీలిస్తే లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఫుల్లుగా మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో లారీని నడపడంతోనే ప్రమాదం జరిగింది. ఆటో నుజ్జునుజ్జు కావడంతో ఆటోలోనే మృతదేహాలన్నీ చిక్కుకుపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.