DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ రోజైనా ప్రకటించే అవకాశం ఉందని భారత రాష్ట్ర సమితిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విపక్షాలకు ఏ మాత్రం ప్రచారం చేసుకునేందుకు సమయం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసిన గులాబీ దళపతి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఓ వైపు నిఘా వర్గాల ఇంటలిజెన్స్ నివేదికలను తెప్పించుకుంటూనే మరోవైపు ప్రయివేటు- సర్వే సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ-ప్యాక్ బృందంతో ఇదివరకే పలు దఫాలు సర్వే చేయించినట్టు- సమాచారం.
ఆయన జాబితాలో ప్రతికూల నివేదిక వచ్చినవారిని ఇప్పటికే ప్రగతి భవన్‌కు పిలిపించి కేసీఆర్ తలంటు- కూడా పోశారు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో మరోసారి ఐ-ప్యాక్ టీ-మ్ సర్వే జరిపి కేసీఆర్‌కు రిపోర్టిచ్చింది. తాజా రిపోర్టులో నెగెటివ్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాకిస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు నాటికే సగానికి పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం.
అధిక మాసం కావడంతో కేసీఆర్ సెంటిమెంటు- పరంగా కొంత ఆలోచిస్తున్నారని, లేకపోతే ఆగస్టు 12 లేదా 13 తేదీలలోనే ఏకంగా 87 సీట్లకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించేవారని భారాస నేతలు చెబుతున్నారు. ఒకవేళ అధిక మాసంలో ఎందుకనుకుంటే మాత్రం ఆగస్టు 17 తర్వాత ఏ క్షణమైనా బీఆర్‌ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం.
అయితే, ఈ జాబితాలో సిట్టింగులందరికీ పోటీ- చేసే అవకాశం ఇస్తారా లేక కొందరిని తప్పిస్తారా అన్న ఆసక్తి రేపుతోంది.
సిట్టింగుల్లో ఎవరికైనా టిక్కెట్ దక్కకుంటే వారు ప్రత్యర్థి పార్టీల వైపు చూసే అవకాశా లుండడంతో వారితో ముందుగానే ఓ మాట చెప్పడం ద్వారా వారి భవిష్యత్‌పై భరోసా కల్పించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు- తెలుస్తోంది. 2018లో అనూహ్య నిర్ణయంతో ముందస్తుకు వెళ్ళిన కేసీఆర్.. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
సెప్టెంబర్ నెలలోనే అభ్యర్థులను ప్రకటించి.. క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని వారికి చెప్పారు. తెలంగాణలో 119 సీట్లు ఉండగా ఎన్నికలకు మూడు నెలల ముందుగానే ఏకంగా 105 సీట్లకు అభ్యర్థులను అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 80 నుంచి 87 సీట్లకు అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఖరారు చేసినట్లు- సమాచారం. ఆగస్టు మూడో వారం కల్లా జాబితాను వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే తొలి జాబితాలో ఒకరిద్దరు మంత్రుల పేర్లు ఉండకపోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి ఉన్నారని సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. సదరు మంత్రికి సంబంధించిన అభ్యర్థిత్వంపై ఎన్నిసార్లు సర్వేలు జరిపించినా, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించినా ప్రతికూల నివేదికలు వస్తున్నట్టు- చెబుతున్నారు. దీంతో ఆ మంత్రి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న విపక్ష పార్టీ నాయకుడిని భారాసలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్టు- తెలుస్తోంది. పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ కట్టబెట్టాలని.. మంత్రిని ఇబ్బంది పెట్టకుండా లోక్ సభ ఎన్నికల్లో పోటీ- చేయించడమా లేదా ఎమ్మెల్సీగా అవకాశమివ్వడమో చేయాలన్న ప్రతిపాదన సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్టు- చెబుతున్నారు.