DBN TELUGU:- గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి బైపాస్ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లాలోని రాజంపేట గ్రామానికి చెందిన కాసం శంకర్ (63) హైదరాబాద్ వైపు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా వెనక నుండి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మండల పరిధిలోని రెడ్డిపల్లి శివారులోని 44వ జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.