Type Here to Get Search Results !

టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్.

DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట 2 గని లో టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో టిబిజికెయస్ గేట్ మీటింగ్.



- ముఖ్య అతిథిలుగా మందమర్రి ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికాల సంపత్.

- భారీగా టిబిజికెయస్ లో చేరిన ఇతర యూనియన్ నాయకులు, కార్మికులు.



కాసిపేట 2 గని లో టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మేడిపల్లి సంపత్, బడికాల సంపత్, రీజనల్ సెక్రటరీ ఓ.రాజశేఖర్, ఈ సందర్భంగా కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కార్మికులను కడుపున పెట్టుకున్న సంఘం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం ఒక్కటేనని, గెలిచిన తదనంతరం నుండి బదిలీస్ గా అపాయింట్మెంట్ 190/240 మాస్టర్లు నిండిన ప్రతి ఒక్క కార్మికుని జనరల్ మజ్దురుగా రెగ్యులరైజ్ చేస్తూ వస్తుంది. ఇంతకు ముందు బదిలీ కోల్ పిల్లర్ నుండి జనరల్ మజ్దూర్ గా రెగ్యులరైజ్ కావడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టేది కానీ అపాయింట్మెంట్ అయినా ఒక సంవత్సరానికె జనరల్ మజ్దూర్ గా పర్మనెంట్ చేపియ్యడం జరుగుతుంది. అందులో భాగంగా మా యూనియన్ అధ్యక్షులు B.వెంకట్రావు, జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య యాజమాన్యాన్ని కోరిన వెంటనే యాజమాన్యం వారు 31/12/2022 లోపల అపాయింట్మెంట్ ఐ 190/240 మాస్టర్ నిండిన బదిలీ కోల్ పిల్లర్ బదిలీ వర్కర్ కార్మికులను జనరల్ మజ్దూర్లు గా రెగ్యులరైజ్ చేయడానికి సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇందుకు కృషిచేసిన అధ్యక్షులు వెంకట్రావు కి జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య కి కాసిపేట 2 గని కార్మికుల తరుపున క్రృతజ్గతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, రీజనల్ సెక్రటరీ ఓ.రాజశేఖర్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జీ పెండ్రి రాజిరెడ్డి, ఏరియా సెక్రటరీ శంకార్రావు, వోడ్నాల రాజన్న, కాసిపేట ఫిట్ సెక్రటరీ బైరీ శంకర్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సెగ్గం శ్రీనివాస్, టిబిజికెయస్ సెఫ్టి అండ్ మైన్స్ కమిటీ మెంబర్ లు రాజేందర్, గణపతి తిరుపతి, క్రృష్ణ మోహన్, పిరిసింగుల రాజు, మస్కా రమేష్, గోపాలకృష్ణ, కోత్తపల్లి ఉదయ్, గోమాస తిరుపతి మరియు టిబిజికెయస్ యువ నాయకులు సారంగపాణి, కమల్, పెరుగు శరత్, గణపతి అంజి, రవికిరణ్, పోషం, మరియు టిబిజికెయస్ నాయకులు కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.