DBN TELUGU:- తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాది వ్యవధిలోని నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా సంగారెడ్డిలో మరో యువతి బలవన్మరణాకి పాల్పడింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి ఐఐటీలో ఎంటెక్ చదువుతోన్న మమైతా నాయక్ అనే యువతి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. రూమ్‌లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మమైతా సూసైడ్ చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువతి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలు మమైతా నాయక్ స్వస్థలం ఒడిషా రాష్ట్రం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.