DBN TELUGU:- జోగులంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో నాలుగవ వార్డుకు చెందిన డి ఎర్రన్న కొడుకు బన్నీ పై పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... బాలుని తల్లిదండ్రులు పొలానికి వెళ్ళగా మధ్యాహ్నం అన్నం తిని ప్లేటు కడిగి చల్లడానికి బయటికి వెళ్లగా ఆ బాలునుపై పందులు అమాంతంగా దాడి చేసి ఒళ్లంతా తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయమై సీనియర్ దండోరా నాయకుడు ఆంజనేయులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు ప్రజలపై కుక్కలు, కోతులు, పందులు దాడులు చేస్తుంటే వారు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు వెంటనే అధికారులు పందుల యజమానులపై కేసు నమోదు చేసి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.