DBN TELUGU:- గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
✓ 500 గ్రాముల గంజాయి స్వాధీనం.
✓ నిందితుని వివరాలు:- బాల్మీకి అనుదీప్ s/o నరేష్ బెల్లంపల్లి,మంచిర్యాల జిల్లా.
✓ వివరాల్లోకి వెళితే.... శనివారం ఉదయం బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బయట టాస్క్ పోలీసులను గమనించి ఒక వ్యక్తి పారిపోతుండగా అతన్ని పట్టుకొని అతనిని తనిఖీ చేయగా చిన్న చిన్న ప్యాకెట్ లలో సుమారు 500 గ్రాముల డ్రై గంజాయి లభించింది. అనంతరం.. అతనిని పట్టుకొని విచారించగా అతని పేరు అనుదీప్ బెల్లంపల్లి అని తెలిపి చదువు మధ్యలో ఆపేసి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో మహారాష్ట్ర లోని బల్లర్ష నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అమాయకపు యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది. నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం అప్పగించారు.