• నాపై గురి పెట్టి వదిలిన తుపాకీ గుండును మళ్లీ అటు వైపే తిప్పుతా.
• రాజకీయ లబ్ధి, వ్యక్తిగత స్వార్ధం కోసమే నాపై ఆరోపణలు.
• నేను ఏ తప్పు చేయలేదు.. అందుకే కేసీఆర్ నాకు చాన్స్ ఇచ్చారు...
• రానున్న ఐదేళ్లలో బెల్లంపల్లిని బంగారు తునక చేసి చూపిస్తా.
• ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్, ఇండస్ట్రీయల్ హబ్ గా ఎదగబోతోంది..
• బెల్లంపల్లిలో అగ్రికల్చర్ కాలేజీ.. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ.
• మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కచ్చితంగా నేను సాధించి చూపిస్తా.
• నాపై నమ్మకం.. బీఆర్ఎస్ పై ప్రేమ ఉన్న బెల్లంపల్లి ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు బెల్లంపల్లి ఎమ్మెలే దుర్గం చిన్నయ్య.
అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ సర్కారు నినాదం. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులతోనే ప్రజలు మరోసారి దీవిస్తారు. ధర్మయుద్ధంలో ఎదుర్కొనే సత్తాలేకే కాంగ్రెస్, బీజేపీలు శిఖండి రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ రాజకీయ చతురత ఎవరికీ అంతుపట్టదు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కేసీఆర్ వదిలిన బుల్లెట్లు.. వాళ్లను తట్టుకొని నిలబడే శక్తి ఎవరికీ లేదు. రానున్న ఐదేండ్లలో బెల్లంపల్లిని బంగారు తునకగా మారుస్తా. ఎడ్యుకేషన్, ఐటీ, ఇండస్ట్రీయల్ హబ్ గా ఎదగబోతోంది. అగ్రికల్చర్, ఇంజినీరింగ్ కాలేజీ కోసం కృషి చేస్తున్నా. నన్ను ఓడించాలని ప్రతిపక్ష నాయకులు కుట్రలు చేస్తున్నరు. రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత స్వార్ధం కోసం నాపై ఆరోపణలు చేస్తున్నారని బెల్లంపల్లి ప్రజలు, ఆడబిడ్డలే చెబుతున్నరు. నేను ఏ తప్పు చేయలేదని ప్రజలు నమ్మారు. అందుకే కేసీఆర్ టికెట్ మళ్లీ నాకే ఇచ్చారు. ఎవరెన్నీ కుట్రలు, జిమ్మిక్కులు చేసినా భారీ మెజార్టీతో గెలుస్తా.. " నాపై గురిపెట్టి వదిలిన తుపాకీ గుండును మళ్లీ అటువైపే తిప్పుతా " అని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.