DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణం లోని 20వ వార్డ్ లో 2 కోట్ల 45 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ మరియు మున్సిపాలిటీ వాహనాల పార్కింగ్ షేడ్ నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై పనులను ప్రారంభించిన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే... బెల్లంపల్లి పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతుందని, రానున్న రోజులలో బెల్లంపల్లి మరింత అభివృద్ధి చెంది... పెద్ద పెద్ద నగరాలకు పోటీపడే విధంగా తయారవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్స్ గోసిక రమేష్, గెల్లి రయాలింగు, నీలి కృష్ణ, అశోక్ గౌడ్, ధమేర శ్రీనివాస్, రాములు నాయక్, సముద్రాల లావణ్య, కో ఆప్షన్ సభ్యులు ఏలూరి వెంకటేష్, సాజిద్ వాజిద్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, పట్టణ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, BRSV జిల్లా అధ్యక్షులు శ్రావణ్, ఏస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, BRSY పట్టణ అధ్యక్షుడు సన్నీ బాబు, BRSY టౌన్ జనరల్ సెక్రెటరీ శ్యామ్, BRSV టౌన్ ప్రెసిడెంట్ యునుస్, నాయకులు పోలు శ్రీనివాస్, ఏలిగేటి శ్రీనివాస్, మురళి, వాసు, శ్రీధర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.