DBN TELUGU:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు అన్నదమ్ముల మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కౌటాల మండలంలోని వైగాం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో బెజ్జూరు మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బుర్రి అనిల్ (24), బుర్రి వసంత్ (26) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో ముంజంపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు మరణించడంతో గ్రామం మొత్తం విషాద ఛాయలతో అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు కౌటాల సీఐ షాధీక్ పాషా, ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
