DBN TELUGU:- కన్నెపల్లి మండలంలో పాము కాటుకు గురై ఐదు సంవత్సరాల చిన్నారి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మెట్పల్లి గ్రామానికి చెందిన తొర్రెం శ్రీనివాస్ కూతురు సాన్విక ( 5 ) బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామంలో ఉంటున్న తమ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ వారి ఇంట్లోనే ఆడుకుంటుండగా పాము కాటేయడంతో వెంటనే చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిర్పూర్ టౌన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
