DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గన్నవరం వద్ద మంగళవారం ఆగి ఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు.
మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు సూర్యాపేట జిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్, మతిన్‌గా గుర్తించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం పరిశీలిస్తే అధిక వేగమే అని తెలుస్తుంది.