DBN TELUGU:- తన హత్యకు ప్రగతి భవన్ నుంచే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. సుపారీ ఇచ్చి హత్య చేయించాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలే తనకు చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో, శాడిస్ట్ అన్న ఈటల.. తనతోపాటు కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
