DBN TELUGU CHANNEL:-
• మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
• ఆగి ఉన్న బులోరా వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.
• ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి.
• గాయాలతో బయటపడ్డ 15 మంది కూలీలు.
• గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
• మృతి చెందిన మహిళలు చంద్రపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు.
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి సోమవారం ఉదయం ముగ్గురు మహిళలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పొట్టకూటి కోసం చంద్రపూర్ జిల్లాకు చెందిన వ్యక్తులు ఉపాధి కోసం కరీంనగర్ వైపు వెళ్తుండగా జైపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని బులోరా వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాద సమయంలో బొలెరోలో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. 15 మంది కూలీలు ప్రాణాలతో బయటపడి, తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
