Type Here to Get Search Results !

Flash News:- సౌదీలో ఘోర బస్సు ప్రమాదం

DBN TELUGU CHANNEL:-


42 మంది సజీవదహనం.. హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం.


మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.


ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనం.


మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను గుర్తించిన అధికారులు.


బస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో దహనమైన మృతదేహాలు.





మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం.. ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి.


డివిఎన్ తెలుగు ఛానల్: - సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతుల కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తోను, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు మాట్లాడడం జరిగింది. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

+9179979 59754.

+91 99129 19545.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.