DBN TELUGU:-
- ఐఐటి ఖరగ్ పూర్ లో సీటు సాధించి సత్తాచాటిన నిరుపేద విద్యార్థి.
- అభినందించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.
- సన్మానించిన పేరెంట్స్ కమిటీ.
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థి దుర్గం చరణ్ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖరగ్ పూర్ ఐఐటి లో సేటు సాధించాడు. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ నిర్వహించిన మొదటి రౌండ్ కౌన్సిలింగ్ లో చరణ్ తేజ్ ఈ సీటు సాధించడం గర్వంగా ఉందని ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ రెండు దశలలో నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపి ఈ సీటు సాధించినట్లు ఆయన తెలిపారు.
-- చరణ్ తేజ్ కుటుంబనేపథ్యం--
-- నిరుపేద కుటుంబంలో పుట్టిన చరణ్ తేజ్ ఆరు నెలల పసిగందు గా ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి దూరమైంది. తల్లిదండ్రులు ఇద్దరు లేకపోవడంతో పెదనాన్న దుర్గం వెంకటి - ప్రమీలలు చేరదీసారు. బెల్లంపల్లి మండలం చాకపెల్లి గ్రామంలో చిన్నపాటి సైకిల్ షాప్ నిర్వహిస్తూ తన పిల్లలతోపాటు చదివించారు. నిరుపేద కుటుంభమైనా 10వ తరగతి వరకు మంచిర్యాల క్రిష్టియన్ హాస్టల్ లో అనాథల కోటాలోచదివాడు. చదువులో చురుకుగా ఉన్న చరణ్ తేజ్ ఆసక్తిని గమనించి వారి పెదనాన్న ఇంటర్మీడియట్ చదువుకోసం పరీక్ష రాయించాడు. సిటు పొందిన చరణ్ తేజ్ ఇంటర్ విద్యను బెల్లంపల్లి సి ఓ ఈ లో పూర్తిచేశాడు. ఇంటర్మీడియట్ తో పాటు బెల్లంపల్లి సి ఓ ఈ లో జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదును పొందిన చరణ్ జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖరగ్ పూర్ ఐఐటి లో సీటు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
--పేరెంట్స్ కమిటీ సన్మానం--
-- తల్లిదండ్రులు ఇద్దరూ దూరమైనా మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన చరణ్ తేజ్ ను బెల్లంపల్లి సి ఓ ఈ పేరెంట్స్ కమిటీ అభినందనలు తెలిపింది ఈ సందర్భంగా వారు చరణ్ తేజ్ శాలువాతో సత్కరించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోట రాజ్ కుమార్, జెవిపి శ్యాంసుందర్ రాజు, పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పుదారి నగేష్ గౌడ్, దాగం మహేష్, అధ్యాపకులు నాగిని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మినారాయణ, పిన్నింటి కిరణ్, ముద్దసాని శోభ, కట్ల రవిందర్, అవునూరి రవి, యండి రఫీ, సీనియర్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, అకెనేపల్లి రాజేష్, విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డూరి వెంకటస్వామి, దుర్గం వెంకటి, తదితరులు పాల్గొన్నారు.